: అంగారకుడిపై అప్పుడు నీరుండేది!


అంగారక గ్రహంపై ఒకప్పుడు తాగేందుకు అనువైన నీరు ఉండేదని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గ్రహంపై పరిశోధనకు నాసా పంపిన ఆపర్య్చునిటీ రోవర్‌ తన ఖాతాలో మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. ఈ రోవర్‌ బంకమట్టి, ఖనిజాలతో కూడిన ఒక శిలను కనుగొంది. ఈ శిలను పరిశీలించిన శాస్త్రవేత్తలకు ఒకప్పుడు ఆ గ్రహంపై నీరు ప్రవహించిందనడానికి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. బంకమట్టి అనేది శిలతో నీరు చర్య జరిపినపుడు ఏర్పడుతుంది. అయితే నీరు, శిల తీరును బట్టి రకరకాలైన బంకమట్టి ఏర్పడుతుంది. అయితే రోవర్‌ గుర్తించిన ఎస్పరెన్స్‌ అనే శిలలో అల్యూమినియం పుష్కలంగా ఉన్న బంకమట్టి ఉండడాన్ని రోవర్‌ గుర్తించింది.

ఈ బంకమట్టి తాగడానికి వీలైన నీటిలోనే ఏర్పడినట్లు కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త స్టీవ్‌ స్వ్కైరెన్‌ చెబుతున్నారు. జీవులు ఆవిర్భావానికి దారితీసే రసాయన పరిస్థితులకు ఇది దోహదపడేలా ఉందని ఆయన వివరించారు. కాగా, నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్‌ కూడా గేల్‌ బిలంలో తాగడానికి అనువైన నీరు ఒకప్పుడు ఉండేదనేదానికి సంబంధించిన ఆధారాలను ఇటీవలే కనుగొంది.

  • Loading...

More Telugu News