: వారికే రొమ్ముక్యాన్సర్‌ ముప్పు ఎక్కువ


మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువమందికి వస్తోంది. అయితే మగువల్లో ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారిలో రొమ్ము క్యాన్సర్‌ ఎక్కువగా వచ్చే అవకాశముందని ఒక తాజా అధ్యయనం తేల్చింది. ఉద్యోగాలు చేసే మహిళలకు కార్యాలయాల్లో పనిసంబంధమైన ఒత్తిడి, ఇంకా సహోద్యోగుల్లో వివక్ష వంటి పలు కారణాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మహిళా ఉద్యోగినులకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం 70 శాతం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనాన్ని 1975 నుండీ కొనసాగించారు. ఇందుకోసం 36 సంవత్సరాల వయసులో ఉన్న సుమారు నాలుగువేల మంది ఉద్యోగినులను ఎంపిక చేసుకుని వారి ఉద్యోగ, ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ వాటికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ రోజుల్లో మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉద్యోగాలు చేసిన మహిళలు అప్పటి సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల నేపధ్యంలో తీవ్ర వివక్షను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. కార్యాలయంలోని సహోద్యోగులు, సహాయక సిబ్బంది ఇలా అన్ని వర్గాల నుండి మహిళా ఉద్యోగినులు తీవ్ర వివక్షను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో మహిళా ఉద్యోగినులు సహజంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడే వారిలో రొమ్ము క్యాన్సర్‌ వంటి జబ్బులు రావడానికి కారణమని ఈ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా మహిళలు అలాంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నారని ఈ అధ్యయననాన్ని నిర్వహించిన వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News