: బెంగాల్లో 20 మంది చిన్నారుల మృతి
బెంగాల్లో మరోసారి మరణమృదంగం మోగింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పసిమొగ్గలు నేలరాలుతున్నాయి. గత కొద్దికాలంగా జరుగుతున్న మృత్యుహేళీని ఆపడానికి ప్రభుత్వం శ్రద్దచూపడం లేదు. వరుసబెట్టి చిన్నారులు మృతి చెందుతున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం ఆ కన్నపేగుల్ని కలచివేస్తోంది. గత కొద్దికాలంగా బెంగాల్ ప్రభుత్వాసుపత్రుల్లో వరసబెట్టి చిన్నారులు చనిపోతున్నారు. వైరస్ సంబంధవ్యాధుల కారణంగా వీరు మృత్యువాత పడుతున్నారని చెబుతున్న ఆసుపత్రి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సంచలనం రేపుతోంది. ఇప్పటివరకూ 20 మంది చిన్నారులు మృతి చెందడంపై హక్కుల సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.