: సౌత్ ఆఫ్రికా 234/9
ఛాంపియన్స్ ట్రోఫీలో హోరా హోరీగా సాగుతున్న పోరులో పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా జట్లు కొదమ సింహాల్లా తలపడుతున్నాయి. బౌలింగ్ కు అనుకూలమైన పిచ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా ఆద్భుత పోరాట పటిమతో 81 పరుగులు సాధించగా, అతనికి ఇంగ్రామ్(20), డుప్లెసిస్(28), డివిలీర్స్ (31), డుమిని(24) చక్కని సహకారమందించారు. చివర్లో టెయిలెండర్లు పాక్ బౌలింగ్ ధాటికి వడివడిగా వికెట్లు కోల్పోవడంతో 234 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో వాహెబ్ రియాజ్ తప్ప మిగిలిన ఐదుగురు బౌలర్లూ తలో వికెట్ పడగొట్టారు. మరి కాసేపట్లో 235 పరుగుల విజయలక్ష్యంతో పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.