: ఆ పీడకల పునరావృతం కారాదు: ప్రధాని
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు తరహా దాడి ఘటనలు పునరావృతం కాకూడదని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిలపక్షం సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, మావోల దాడి దేశప్రజాస్వామిక పునాదులపై జరిగిన దుర్ఘటనగా అభివర్ణించారు. ఛత్తీస్ గఢ్ దాడి ఘటనను ఖండిస్తూ తీర్మానం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు రెండంచెల వ్యూహాన్ని అనుసరించి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.