: విభేదాలు పక్కనబెట్టి పార్టీ కోసం పని చేయండి: పార్టీ నేతలకు రాహుల్ హితవు
ఎన్నికలు
సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలు
పక్కనబెట్టి, పార్టీ కోసం కష్టించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
శ్రేణులకు హితోపదేశం చేశారు. ఢిల్లీలో ఈ రోజు ముగిసిన సమావేశంలో ఆయన
మాట్లాడుతూ, నెలలో పది రోజుల పాటు జిల్లాల్లో పర్యటిస్తేనే ఫలితాలు
ఆశాజనకంగా ఉంటాయని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో రెండు మూడు
నెలలకు ఓసారి భేటీ అవ్వాలనీ, ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిలా
పనిచేయాలనీ సూచించారు.