: 'ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయండి'
ఏపీపీఎస్సీని తక్షణం ప్రక్షాళన చేయండి... అంటూ సుపరిపాలన వేదిక(ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) డిమాండ్ చేసింది. ఈ రోజు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసిన సుపరిపాలన వేదిక ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో సమాచార, పబ్లిక్ సర్వీస్ కమీషన్ లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 3(1)-7 ప్రకారం రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, సామాజిక వేత్తలకు మాత్రమే కమీషన్ లో పదవులు ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. గత ఆరు నెలల్లో ఏపీపీఎస్సీలో వెలుగు చూసిన అవినీతి అక్రమాల వల్ల యువతలో నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగం కష్టపడితే రావడం లేదన్న అభిప్రాయం యువతలో పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.