: సిల్వెస్టర్ ను ఆకట్టుకున్న బాలీవుడ్ హీరో కండలు


కండల వీరత్వాన్ని ప్రదర్శించడంలో ఆద్యులు హాలీవుడ్ హీరోలు. సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ వంటి హీరోల కండలు తిరిగిన దేహాలకే లెక్కలేనంతమంది అభిమానులున్నారు. అటువంటి హీరోల్లో ఒకడైన సిల్వెస్టర్ స్టాలోన్ కు మన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం బాడీ తెగ నచ్చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయనే ఆ విషయాన్ని చెప్పాడు. "నా కంటే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తన శరీరాన్ని గొప్పగా మలచుకున్నాడు" అంటూ ప్రశంసించాడు. అయితే, ఈ ప్రశంసలను అంగీకరించలేకపోతున్నాడు జాన్. "సిల్వెస్టర్ ఏ ఉద్దేశంతో అలా అన్నారో నాకు తెలియదు గానీ, ఆ మాట నిజం కాదనిపిస్తోంది. నేను సినిమాల్లోకి రావడానికి ఆయనే స్పూర్తి" అంటూ వినయాన్ని చాటుకుంటున్నాడు జాన్ అబ్రహం.

  • Loading...

More Telugu News