: లో...తుగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం: వెంకయ్య నాయుడు
బీజేపీకి దశాబ్దాల తరబడి దిశానిర్ధేశం చేసిన అగ్రనేత అద్వానీ రాజీనామా పట్ల మరో ముఖ్యనేత వెంకయ్య నాయుడు స్పందించారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని అద్వానీని కలిసి సూచించిన వెంకయ్య నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీలో తీసుకున్న నిర్ణయాల పట్ల ఆందోళనతోనే రాజీనామా చేశానని అద్వానీ తనతో చెప్పారని వెల్లడించారు. అందుకే, పార్టీలో ఏర్పడిన పరిణామాలపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య తెలిపారు. ఏదేమైనా, ఆయన రాజీనామా బాధ కలిగించిందన్నారు. ఆయనకు సర్దిచెప్పగలమన్న విశ్వాసం ఉందని చెప్పారు.