: జగన్ కు మరోసారి చుక్కెదురు
అక్రమాస్తుల కేసులో వీలైనంత త్వరగా బయటపడాలని ఆశిస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. తన కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదు ఛార్జిషీట్లను కలిపి విచారణ చేయాలని కొద్దిరోజుల క్రితం ఆయన సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై నేడు వాదనలు విన్న నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం జగన్ విన్నపాన్ని తోసిపుచ్చింది.