: హోరాహోరీ పోరులో సౌతాఫ్రికా 15/0
ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో నిలిచేందుకు గెలవాల్సిన మ్యాచ్ లో రెండు జట్లు హోరా హోరీ పోరాడుతున్నాయి. రెండు జట్లు ఒక్కో మ్యాచ్ ఓడి పాయింట్ల పట్టికలో సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న కృతనిశ్చయంతో రెండు జట్లూ ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ లో మంచి ఫాంలో ఉన్న పాక్ జట్టు సఫారీలకు షాక్ ఇవ్వాలకుంటుండగా, చాంపియన్స్ హోదాలో టోర్ని ముగించాలని చూస్తున్న సౌత్ ఆఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకం. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, పాక్ పకడ్బందీగా బౌలింగ్ చేస్తూ కట్టడి చేస్తోంది. దీంతో 5 ఓవర్లలో 15 పరుగులు చేసింది సఫారీ జట్టు. మ్యాచ్ ఫేవరేట్ సఫారీ జట్టే!