: ప్రియాంక తండ్రి మృతికి బాలీవుడ్ ప్రముఖల సంతాపం
తండ్రిని కోల్పోయి విచారంలో మునిగిపోయిన బాలీవుడ్ తార ప్రియాంక చోప్రాకు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు. ప్రభుదేవా, బిపాసా బసు, దీపికా పదుకొనే, జెనీలియా, సోఫీ చౌదరి, కునాల్ కోహ్లీ తదితరులు ట్విట్టర్లో ప్రియాంక కుటుంబానికి తమ సానుభూతి ప్రకటించారు. ప్రియాంక తండ్రి డా.అశోక్ చోప్రా కేన్సర్ తో బాధపడుతూ నేడు మరణించిన సంగతి తెలిసిందే.