: ఐపీఎల్ లో ఇక 'ఛీర్స్' ఉండవ్!


ఐపీఎల్ ను స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం కుదిపేయడంతో మేలుకున్న బీసీసీఐ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. లీగ్ లో ఇక ఛీర్ లీడర్స్ సంస్కృతికి చరమగీతం పాడనున్నట్టు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ప్రకటించారు. నేడు ఢిల్లీలో జరిగిన బోర్డు అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మ్యాచ్ లు ముగిసిన పిమ్మట లేట్ నైట్ పార్టీలకు స్వస్తి పలుకుతామని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో జాతీయ సెలెక్టర్లు భాగస్వాములుగా ఉండరాదని దాల్మియా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News