: అద్వానీగారూ.. మా మాట వినండి: మొదలైన బుజ్జగింపులు


పార్టీకి రాజీనామా చేసిన అగ్రనేత అద్వానీని బుజ్జగించేందుకు బీజేపీ సీనియర్లు రంగంలోకి దిగారు. పార్టీ అధినాయకత్వంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు అగ్రనేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో వెంకయ్యనాయుడు, వీకే మల్హోత్రా, అనంతకుమార్ ఢిల్లీలో అద్వానీతో భేటీ అయ్యారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని వారు ఆయనకు నచ్చచెప్పినట్టు సమాచారం. కాగా, అద్వానీ రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News