: చైనా ఏం చేస్తుందో చూడండి: తరుణ్ గోగోయ్
మానవ జీవనానికి ప్రాణాధారం నీరు. నాగరికతలకు ఆలంబన నీరు. అలాంటి నీటిని చైనా తన అధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కడో హిమాలయాల్లో పుట్టి నేపాల్, చైనా, భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలలోని లక్షలాది ప్రజలకు నీరందిస్తున్న బ్రహ్మపుత్ర నది చివరికి బంగ్లాదేశ్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
2,906 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించే బ్రహ్మపుత్ర నది ఆసియాలోని పొడవైన నదుల్లో ఒకటి. ప్రస్తుతం ఈ నదిపై చైనా కన్ను పడింది. టిబెట్టు దేశంలో బ్రహ్మాపుత్ర నదిపై చైనా మూడు భారీ హైడ్రోపవర్ ప్రాజెక్టు (దాగు, జైచా, జిక్స్ యు)లను నిర్మించేందుకు సిద్ధపడుతోంది.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈశాన్య రాష్ట్రాల ప్రజల జీవనం అస్తవ్యస్తం అవుతుందని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్... ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. ఎందుకంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 80 శాతంపైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
చైనా కట్టబోయే ఈ భారీ ప్రాజెక్టులతో బ్రహ్మాపుత్ర నది దిశమార్చి తన దేశంలోని 130 కోట్ల మందికి నీరందించాలని భావిస్తోంది. ఇలా చేస్తే భారత్, బంగ్లాదేశ్ దేశాల్లోని నదీపరీవాహక ప్రాంతాలు పూర్తిగా దెబ్బతింటాయని గోగోయ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో లోతట్టు ప్రాంతాల్లో వరదలను నివారించి ఆ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడొచ్చని చైనా చెబుతోంది. ఇప్పటి వరకు భారత్, చైనా దేశాల మధ్య నీటి వాటాలపై చర్చలు జరగలేదని నిపుణులు చెబుతుండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.