: రాంచరణ్ చొక్కా చింపిన అభిమానులు
రాంచరణ్ కు అభిమానుల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. సతీ సమేతంగా శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు రాంచరణ్ వెళ్లారు. ఈ రోజు దర్శనం అనంతరం అక్కడ రాంచరణ్ ను చూసేందుకు, చేయి కలిపేందుకు అభిమానులు పోటీపడ్డారు. అభిమానులు వందలాదిగా పోగవడంతో తోపులాటకు దారితీసింది. కొద్ది మందే ఉన్న పోలీసులు ఆరాటంతో ఉన్న అభిమానులను నిలువరించలేకపోయారు. ఎస్సై భాస్కరరావు కిందపడగా.. రాంచరణ్ చొక్కా కాస్తా చినిగి పీలికలైంది. మొత్తానికి అభిమానులు తమ అభిమానం శ్రుతిమించితే ఎలా ఉంటుందో రాంచరణ్ కు చూపించారు!