: అభిమానం అనేది గుండెలోతుల్లోంచి రావాలి: బాలకృష్ణ
అభిమానం అనేది ఎద లోతుల్లోంచి రావాలే గానీ.. దాన్ని డబ్బు, ఇతర ప్రలోభాలతో స్వంతం చేసుకోలేమని నందమూరి బాలకృష్ణ అన్నారు. తన 53వ జన్మదిన వేడుకలు రామకృష్ణ స్డూడియోలో నిర్వహించిన సందర్భంగా బాలయ్య అభిమానులను ఉద్ధేశించి మాట్లాడారు. తనకు జన్మనిచ్చింది తారకరామారావు దంపతులే అయినా, ఇంతవాడిని చేసింది మాత్రం అభిమానులే అని బాలయ్య ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు.