: టీడీపీ డిమాండ్ బుట్టదాఖలు చేసిన సలహా సంఘం


శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరో 10 రోజుల పాటు అదనంగా నిర్వహించాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించలేదు. సభా నిర్వహణపై ఈ మధ్యాహ్నం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం భేటీ అయింది. పలు అంశాలపై చర్చించిన పిదప చివరి దశ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 21 వరకు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ డిమాండ్ పై స్పందించిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున పనిదినాలు పెంచలేమని స్పష్టం చేశారు. ఉన్న పనిదినాలు సవ్యరీతిలో వినియోగించుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News