: అక్బరుద్దీన్ విడుదల కోసం అభిమానుల నిరీక్షణ


 
ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి మరికాసేపట్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విడుదల కానున్నారు. ఈ రోజు అక్బర్ విడుదల కానున్నారన్న వార్త తెలియగానే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలివచ్చారు. అభిమానులు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని, నాట్యం చేస్తూ తమ ఆనందాన్ని తెలియపరిచారు.  

అయితే బెయిల్ షరతుల్లో ఒకటైన పాస్ పోర్టును అక్బర్ ఇంకా సమర్పించకపోవడంతో ఆయన విడుదల ఆలస్యం కానుంది. దీంతో అభిమానుల ఉత్సాహంపై నీళ్ళు చల్లినట్లయింది. అయితే నిర్మల్ కోర్టులో అక్బర్ తరపు న్యాయవాదులు ఆయన పాస్ పోర్టును సమర్పించారు. దీంతో అక్బర్ విడుదలకు మార్గం సుగమం అయింది. ఓ వైపు అక్బర్ అభిమానులు తరలివస్తూండటంతో ఆదిలాబాద్ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం అక్బరుద్దీన్ హైదరాబాదులోని తన నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News