: ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు


నందమూరి బాలకృష్ణ 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో ఈ వేడుకలు ఆడంబరంగా జరిగాయి. ఇందుకోసం స్టూడియోలో ప్రత్యేక వేదిక నిర్మించారు. భారీ సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తన జన్మదినం సందర్భంగా బాలయ్య పింక్ కలర్ షర్టులో మెరిసిపోతూ కనిపించారు. ఈ వేడుకలకు బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. కాగా, బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న నూతన చిత్రం 'జయసింహ' షూటింగ్ నేడు ఆరంభం కానుంది.

  • Loading...

More Telugu News