: గీతారెడ్డికి హోంశాఖ.. షరతులు వర్తిస్తాయి!
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె. గీతారెడ్డికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ఆమెకు హోం మంత్రిత్వ శాఖ విధులు అప్పగించారు. అయితే, శాసనసభా సమావేశాల ముగిసేంతవరకే గీతారెడ్డి హోం శాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. సభలో హోం శాఖకు సంబంధించిన వ్యవహారాలపై ప్రశ్నలు, చర్చలు చోటు చేసుకున్నప్పుడు గీతారెడ్డి బదులిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయం తీసుకున్నారు.