: దగ్గుబాటి, సుబ్బరామిరెడ్డి మధ్య మొదలైన లీగల్ బ్యాటిల్


తనపై వివాదాస్పద ఆరోపణలు చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి సుబ్బరామిరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. గతంలో సుబ్బరామిరెడ్డి కాంట్రాక్టర్ గా ప్రాజెక్టులలో అక్రమాలకు పాల్పడ్డారంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాటిని నిరూపించాలని, లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుబ్బరామిరెడ్డి నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తనకు నోటీసులు అందలేదని, ఈ విషయాన్ని మీడియా ద్వారానే తెలుసుకున్నానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News