: చేవెళ్ళ రూపురేఖలు మార్చేస్తానంటున్న కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ వస్తే చేవెళ్ళ రూపురేఖలు మార్చేస్తానని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వాగ్దానం చేశారు. గుర్గావ్, నోయిడా తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టును ప్రారంభించారని ఆరోపించారు. తరాలు మారుతున్నా ఈ ప్రాజెక్టుకు మాత్రం మోక్షం కలగడంలేదని విమర్శించారు.