: ఫిక్సింగ్ పై మీరూ దర్యాప్తు చేయండి: ఈడీని కోరిన ఢిల్లీ పోలీసులు
సంచలనం రేపిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) కూడా విచారణ ప్రారంభించాలని డిల్లీ పోలీసులు కోరారు. టోర్నీలోకి హవాలా మార్గాల్లో ప్రవేశించిన నిధులపై నిగ్గు తేల్చాలని పోలీసులు ఈడీకి సూచించారు. పాకిస్తాన్, దుబాయ్ ల నుంచి భారత్ లోకి మనీల్యాండరింగ్ జరిగి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఫిక్సింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఆర్ధిక లావాదేవీలపైనా ఆరా తీయాలని కూడా పోలీసులు కోరుతున్నారు. ఈమేరకు వారు ఈడీకి లేఖ రాశారు.