: త్వరలో రాష్ట్రంలో రాహుల్ పర్యటన: బొత్స
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. నిన్నటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో రాహుల్ గాంధీ సమావేశం నేడు ముగిసింది.
అనంతరం బొత్స మాట్లాడుతూ తెలంగాణ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను రాహుల్ సూచించినట్లు బొత్స తెలిపారు.
అనంతరం బొత్స మాట్లాడుతూ తెలంగాణ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలను రాహుల్ సూచించినట్లు బొత్స తెలిపారు.