: మేనల్లుడి సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్న 'సూపర్ స్టార్'
రెండ్రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ప్రేమకథా చిత్రమ్' హిట్టవ్వాలని సూపర్ స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. ఈ సినిమాను ఆయన బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి నేడు హైదరాబాద్ లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, హీరోహీరోయిన్లు సుధీర్, నందితలు చక్కని నటన ప్రదర్శించారని ప్రశంసించారు. ఇక ఈ చిత్ర బృందానికి కృష్ణ అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో 'వెన్నెలైనా చీకటైనా' (పచ్చనికాపురం) పాట రీమిక్స్ చాలా బాగుందని అన్నారు. ఈ చిత్ర కథానాయకుడు సుధీర్.. కృష్ణగారి మేనల్లుడన్న సంగతి తెలిసిందే.