: అవిశ్వాసం పెట్టినా.. డోంట్ కేర్: సర్కారు ధీమా
రేపటి నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ కు చెందిన 9 మంది ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటేసిన తరుణంలో.. సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా దీటుగా స్పందిస్తామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సమావేశాలకు తాము సన్నద్ధమయ్యామని చెప్పారు. కాగా, ఎమ్మెల్యేలపై వేటు అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 146కి పడిపోయింది. కాగా, శాసనసభ స్థానాల సంఖ్య 294 కాగా.. తాజా పరిణామాల నేపథ్యంలో మ్యాజిక్ సంఖ్య 140 గా ఉంది.