: 'అసభ్య ప్రవర్తన'పై స్పందించిన అల్లు శిరీష్
జూబ్లీహిల్స్ లోని పబ్ లో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ, ఢిల్లీకి చెందిన ఓ మహిళా డీజే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు శిరీష్ పై కేసుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయమై అల్లు శిరీష్ స్పందించాడు. ఆ యువతి ఎవరో తనకు తెలియదని చెప్పాడు. తనకు ఎవరితోనూ వివాదాల్లేవని స్పష్టం చేశాడు. ఆమె ఓ ప్రముఖ హీరో తమ్ముడిపై కేసు పెడితే తన పేరు ప్రచారంలోకి రావడం పట్ల శిరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నిన్న రాత్రి 12.30 గంటలకల్లా పబ్ నుంచి తిరిగొచ్చానని.. 2 గంటలకు గొడవ జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని ఈ యువ హీరో అంటున్నాడు. సంబంధంలేని విషయాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకేంటని అల్లువారబ్బాయి తిరిగి ప్రశ్నిస్తున్నాడు.