: నరేంద్ర మోడీ భీకర శపథం
భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన నరేంద్ర మోడీ భీకర శపథం చేశారు. గోవాలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్.. 2014 ఎన్నికల్లో ప్రచార సారథిగా తన పేరును అధికారికంగా ప్రకటించగా.. మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ట్విట్టర్లో స్పందించారు. దేశంలో కాంగ్రెస్ ను మట్టికరిపించేందుకు లభించే ఏ ఒక్క అవకాశాన్ని వదలనంటూ శపథం చేశారు. అగ్రనేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. తన అభ్యర్థిత్వాన్ని తొలి నుంచి వ్యతిరేకించిన సీనియర్ నేత అద్వానీతో ఫోన్ లో మాట్లాడానని.. ఆయన తనను దీవించారని మోడీ వెల్లడించారు. ఇక తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఈ గుజరాత్ సీఎం ధన్యవాదాలు తెలిపారు.