: వ్యూహరచనలో మునిగితేలుతోన్న బాబు
రెండవ దఫా బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సి వ్యూహంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ముఖ్యులతో తన నివాసంలో నేడు భేటీ అయ్యారు. అవినీతి మంత్రులు, రైతుల సమస్యలు వంటి అంశాలపై కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయాలని బాబు వారికి సూచించారు. ఇక బయ్యారం గనుల్లో లభ్యమైన ఉక్కు తెలంగాణకే చెందాలని అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇక ఇటీవలే విద్యుత్ సమస్యలపై సేకరించిన కోటి సంతకాల ప్రతులను సభలో సమర్పించాలని కూడా బాబు నేతలకు చెప్పారు.