: చేప ప్రసాదానికి తగ్గిన స్పందన
ఉబ్బస వ్యాధిని నివారిస్తుందంటూ ప్రచారంలో ఉన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ముగిసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిన్న మొదలైన ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం ముగిసింది. హైదరాబాద్ కు చెందిన బత్తిన హరినాథ్ గౌడ్ సోదరులు ఈ చేప ప్రసాదాన్ని ఎన్నో ఏళ్ళుగా అందిస్తున్నారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ప్రసాదాన్ని స్వీకరించిన వారి సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 39 వేల మంది చేప ప్రసాదం తీసుకున్నారని వారు వెల్లడించారు.