: టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు
ఏపీపీఎస్సీ అక్రమాలపై ఎలుగెత్తిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు, పరిటాల సునీత తదితరులున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ, ఉద్యోగాలను అమ్ముకుంటోందని ఏపీపీఎస్సీపై ఇటీవలే ఏబీఎన్ చానల్లో స్టింగ్ ఆపరేషన్ కథనం ప్రసారం కాగా.. ఆ అంశంపై టీడీపీ ఉద్యమించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నిన్న సీఎంను కలిసేందుకు అనుమతి నిరాకరించడంతో నేడు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో, టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీపీఎస్సీ తీరును సీఎంకు వివరిద్దామని వస్తే పోలీసులు ఇలా అరెస్టులు చేయడం అన్యాయమని టీడీపీ ఎమ్మెల్యేలు నినదించారు.