: భూమిపైకి పాస్పరస్‌ ఇలా వచ్చింది!


కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై విస్తారంగా పాస్ఫరస్‌ ఉండేదని, ఈ పాస్ఫరసే భూమిపై జీవరాశి పుట్టుకకు కారణమని ఒక పరిశోధనలో తేలింది. జీవం పుట్టుకకు కారణమైన మూలకాల్లో పాస్ఫరస్‌ ఒకటి అని, అయితే అది భూమిపైకి ఉల్కాపాతం వల్ల వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణ ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో అసలు భూమిపైకి పాస్ఫరస్‌ అనేది ఉల్కాపాతం వల్లే వచ్చిందని వెల్లడైంది. ఆష్ట్రేలియా, జింబాబ్వే, అమెరికా వంటి దేశాల్లోని పలు ప్రాంతాల్లోని నేల నమూనాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ వివరాలను సేకరించారు. భూమి ఆవిర్భవించిన తొలినాళ్ళలో భారీ ఎత్తున ఉల్కాపాతం జరగడం వల్ల భూమిపైకి పాస్ఫరస్‌ వచ్చి చేరిందని, ఇది భూమిమీద ఉన్న నీళ్ళలో కలిసి ప్రాథమిక జీవకణాల పుట్టుకకు కారణమైందని వారు చెబుతున్నారు. అయితే కొన్ని వందల ఏళ్ళ క్రితం భూమిపై ఉన్న పాస్ఫరస్‌కు, ప్రస్తుతం భూమిపై ఉన్న పాస్ఫరస్‌కు చాలా తేడా ఉందని వారు చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రాచీన కాలం నాడు ఆవిర్భవించిన జీవజాతులు వంటివి ప్రస్తుతం ఎక్కడా ఆవిర్భవించడం లేదని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News