: పోలీసుల అదుపులో సైబర్ చీటర్
రాష్ట్రంలో సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్నాయి. ఏటీఎం పిన్ నెంబర్లతో ఖాతాదారుల సొమ్మును మాయం చేస్తోన్న సైబర్ నేరగాడి గుట్టురట్టయింది. కడప జిల్లాకు చెందిన నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇతరుల ఏటీఎం పిన్ నెంబర్లు తెలుసుకుని వాటి సాయంతో నగదును స్వాహా చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న నెల్లూరు పోలీసులు నాగేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, చిత్తూరు, మదనపల్లి, తెనాలి, కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో ఈ మోసగాడిపై 25 కేసులు నమోదయ్యాయి.