: యూపీఏ ఘోర వైఫల్యం చెందింది: బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్


దేశంలో అంతర్గత భద్రతను కాపాడడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని బీజీపీ నేత నిర్మలా సీతారామన్ విమర్శించారు. గోవా రాజధాని పనాజీలో నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం పాలనలో విఫలమైందని మండిపడ్డారు. దేశం పలు సమస్యలలో చిక్కుకునేందుకు ప్రధాన కారణం యూపీఎ పాలనే అని అభిప్రాయపడ్డారు. మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఏమైందని ఆమె ప్రశ్నించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంటే ఛత్తీస్ గఢ్ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. అసలు మావోయిస్టుల సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించడం లేదని, అందుకే వారి దుశ్చర్యలకు అడ్డుకట్టవేసేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పోనీ, తీవ్రవాద సమస్యనన్నా రూపుమాపే చర్యలు తీసుకుంటున్నారా అంటే, అదీ లేదనీ, తీవ్రవాదానికి మతం రంగుపులుముతున్నారని నిర్మలాసీతారామన్ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News