: 'బిగ్ బాస్-7' హోస్ట్ సల్మానే !
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్-7' కు హోస్ట్ గా ఈసారి నటుడు సల్మాన్ ఖానే వ్యవహరించనున్నాడు. గత సీజన్ వరకు సల్లూనే హోస్ట్ గా ఉంటూ షోకు మంచి రేటింగ్స్, ఆదరణను తీసుకొచ్చాడు. అయితే, ఉన్నట్టుండి కొన్నిరోజుల కిందట ఈసారి సీజన్ కు కండలవీరుడు హోస్ట్ గా ఉండడంలేదని, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని వార్తలు వచ్చాయి. దాంతో ఒక్కసారే అభిమానులంతా నిరాశకు గురయ్యారు. అటువైపు షో విషయాన్ని షారుక్ కూడా ఎప్పుడూ ధ్రువీకరించలేదు. మళ్లీ ఏమయిందో కానీ, షో నిర్వాహకులు పట్టుబట్టడంతో తన బిజీవర్క్ ను పక్కన బెట్టి సల్మాన్ ఒప్పుకున్నాడు. సల్మాన్ ప్రస్తుతం సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న 'కిక్' షూటింగులో ఉన్నాడు. ఇది పూర్తయ్యాక వచ్చే నెలలో షో ప్రోమోను చిత్రీకరిస్తారు. సెప్టెంబర్ లో షో ప్రేక్షకుల ముందుకు రానుంది.