: టీడీపీ సీనియర్లకు మతి భ్రమించింది: ఎమ్మెల్సీ శివరామిరెడ్డి
టీడీపీ సీనియర్లకు మతిభ్రమించిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. అందుకే ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, తనలాగే ముఖ్యమంత్రులంతా అవినీతిపరులేనన్న భావనలో చంద్రబాబు ఉన్నారన్నారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉండి 850 ఎకరాలు ఐఎంజీకి కట్టబెట్టిన ఘనత బాబుదేనన్నారు. అలాంటి చంద్రబాబుకు అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఏపీపీఎస్సీ సభ్యుల బయోడేటాలు విప్పి చెబుతున్న బాబుకు, ఆయన హయాంలో ఉన్నది కూడా టీడీపీ నేతలేనని శివరామిరెడ్డి గుర్తు చేశారు.