Hardik Pandya: మాజీ భార్య నటాషాను హార్ధిక్ పాండ్యా ‘చీటింగ్‌’ చేశాడా?.. తెరపైకి ఆసక్తికర ప్రచారం!

a rumor among fans that cheating can be the root cause of the separation between Hardik and Natasa
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్ దంపతులు విడిపోయిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగమైన హార్దిక్ పాండ్యా భారత్‌కు వచ్చిన తర్వాత విడాకుల ప్రకటన చేశాడు. వారు విడిపోవడానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. 

అయితే హార్దిక్ పాండ్యా చీటింగ్‌కు పాల్పడడమే మూలకారణం కావొచ్చంటూ సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ మొదలైంది. నటాషా సోషల్ మీడియా యాక్టివిటీ ఇందుకు కారణమైంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చీటింగ్, ఎమోషనల్ అబ్యూస్‌ (అమానించడం) సంబంధిత రీల్స్‌కు నటాషా లైక్స్ కొట్టడమే ఈ ప్రచారానికి ఆజ్యం పోసింది. 

కాగా టీ20 ప్రపంచకప్‌-2024కు ముందే హార్ధిక్ పాండ్యా-నటాషా విడిపోబోతున్నారని ఊహాగానాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ఈ మేరకు చాలా పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ జులై 18న నటాషా, హార్దిక్ ఇన్ స్టాగ్రామ్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కాగా పాండ్యా-నటాషా దంపతులకు నాలుగేళ్ల కొడుకు అగస్త్య ఉన్నాడు. సెర్బియాకు చెందిన మోడల్ అయిన నటాషా ప్రస్తుతం కొడుకుతో స్వదేశంలో నివసిస్తోంది.
Go Back to Shorts
Hardik Pandya
Natasa Stankovic
Sports News
Cricket

More Telugu News