: పేరుకు మాత్రమే భారతి.. భారతీయత ఏదీ?: జగన్ భార్యపై వర్ల కామెంట్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై టీడీపీ నేత వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె పేరుకు మాత్రమే భారతి అని.. అయితే, మచ్చుకైనా భారతీయత కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ కుటుంబంలా అవినీతికి పాల్పడితే, చైనాలో మరణశిక్ష విధించేవారని చెప్పారు. మామ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేసుకున్నారని వర్ల ఆరోపించారు. ఇంత భారీస్థాయిలో అక్రమార్జన పాకిస్తాన్ లో చేస్తే వీరిని తరిమికొట్టేవారని ఎద్దేవా చేశారు. నిన్న జగన్ ను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంలో వైఎస్ భారతి పోలీసులపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే.