: ప్రియాంక చోప్రా తండ్రి పరిస్థితి విషమం


బాలీవుడ్ అందాలతార ప్రియాంక చోప్రా తండ్రి డా.అశోక్ చోప్రా ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన ముంబయి శివారులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా కూడా భారత్ రావడం చూస్తుంటే.. అశోక్ చోప్రా ఆరోగ్యం బాగా క్షీణించినట్టు అర్థమవుతోంది. పాపం, ప్రియాంక గత నెల్లో తన తండ్రికి స్వస్థత చేకూరాలని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయంలో యజ్ఞం కూడా చేసింది.

2009లో ఈయనకు కేన్సర్ సోకినట్టు నిర్ధారణ కాగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారినట్టు వైద్యులంటున్నారు. కాగా, గత ఆరు రోజులుగా ప్రియాంక కుటుంబం ఆసుపత్రి వద్దే ఉంటోంది. వారందరూ ఆసుపత్రి క్యాంటీన్ లోనే భోజనాలు చేస్తున్నారట. ప్రస్తుతం అశోక్ చోప్రాకు ప్రాణవాయువు అమర్చారు.

  • Loading...

More Telugu News