: అద్వానీకి మోడీ ఫ్యాన్స్ సెగ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న అగ్రనేత అద్వానీకి స్వంత పార్టీ కార్యకర్తల నుంచి అనూహ్య నిరసన ఎదురైంది. గోవాలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్వానీ డుమ్మాకొట్టడం ఢిల్లీలోని మోడీ మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, వారు పెద్ద సంఖ్యలో అద్వానీ ఇంటి ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీకి మద్దతివ్వాలంటూ వారు డిమాండ్ చేశారు.
85 ఏళ్ళ అద్వానీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరవడం ఇదే తొలిసారి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథిగా మోడీని ఎంపిక చేయడం ఇష్టంలేకే ఆయన గోవా సమావేశాలకు దూరంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.