: మూడు నెలలుగా 'అమ్మ' భౌతికకాయానికి పూజలు
సృష్టిలో తీయని పదం అమ్మ... దేవుడి ప్రతిరూపం అమ్మ.. అందుకే అతను అమ్మ వియోగాన్ని తట్టుకోలేక పోయాడు. అందుకే తల్లి మృతి చెంది మూడు నెలలవుతున్నా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే గుడికట్టాడు, పూజలు చేస్తున్నాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని పళనిమేడు గ్రామానికి చెందిన మునుస్వామి(64) కి తల్లి లక్ష్మమ్మ(90) అంటే చిన్నప్పట్నుంచీ ఎంతో ప్రేమ. అలాంటి అమ్మ మరణం మునుస్వామిని ఎంతో కుంగదీసింది.
తల్లి మృతి చెందినా ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంటిప్రక్కనే ఓ గది కట్టించి అందులో ఆ మృతదేహాన్ని ఉంచి పూజలు చేసేవాడు. ఆ గదిలో ఊయల ఏర్పాటు చేసి 2 లక్షల వ్యయంతో శవం చెడిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాడు. కానీ, శుక్రవారం ఈ శవం నుంచి దుర్వాసన రావడంతో మునుస్వామిని గ్రామస్తులు నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.