: త్వరలో టూ వీలర్ అంబులెన్సులు


నేడు నగరాల నుంచి చిన్న పట్టణాల వరకూ అన్నీ ట్రాఫిక్ మయమైపోతున్నాయి. ముఖ్యంగా నగరాలు, పెద్ద పట్ణణాలలో అయితే, అంబులెన్సులు ప్రమాద సంఘటన ప్రాంతానికి సత్వరమే చేరుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రమాదరకర పరిస్థితుల్లో ఉన్నవారు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి పరిష్కారంగా త్వరలో దేశంలో ద్విచక్రవాహన అంబులెన్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ టూవీలర్ అంబులెన్సులైతే చిన్న చిన్న గల్లీలు, సందుల్లోనూ ఆపదలో ఉన్న బాధితుడి దగ్గరకు చేరుకోగలవు. దాంతో సత్వర వైద్యం అందుతుంది. ఈ అంబులెన్సుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వైద్యంలో, ప్రాణాలు కాపాడడంలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరు వెంటనే ప్రాణాపాయంలో ఉన్న బాధితుడి వద్దకు చేరుకుని ప్రాథమిక వైద్యం అందిస్తూనే అక్కడి నుంచి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే వరకూ వెంట ఉంటారు. ఇలాంటి అంబులెన్సులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్వీడన్ లలో ఇప్పటికే అమల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News