: బీసీసీఐలో తమిళులకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది: శ్రీనివాసన్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ)లోని ఉత్తరాది లాబీ, దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తమిళులకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఆరోపించారు. వారు చేసిన ఈ కుట్ర బహిరంగ రహస్యమేనని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. బీసీసీఐలో ఉత్తర భారత లాబీ... దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుందని కొన్నిరోజుల కిందట జనతా పార్టీ అధినేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు శ్రీనివాసన్ కూడా స్వామి ఆరోపణలకు మద్దతుగా నిలిచారు. కాగా, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంలో అరెస్టయిన తన అల్లుడు గురునాథ్ మయ్యప్పన్ పై ఆరోపణలు అబద్ధమన్నాడు. అల్లుడిపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే నిర్దోషిగా బయటికి వస్తాడని శ్రీనివాసన్ ధీమా వ్యక్తం చేశాడు.