: పొన్నాల ఏరోబిక్ కసరత్తులు
మంత్రి పొన్నాల లక్ష్మయ్య హన్మకొండ, నక్కలగుట్టలోని నటశివ ఏరోబిక్ సెంటర్ లో ప్రత్యక్షమయ్యారు. చెమటలు కక్కేలా వ్యాయామాలు చేశారు. యువతకు వ్యాయామం ఎంతో మంచిదని, వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఏరోబిక్ సెంటర్ ప్రారంభానికి విచ్చేసిన పొన్నాల అక్కడే సరదాగా కసరత్తులు చేసి అందరినీ ఆకట్టుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి ఆయన టీ షర్టు ధరించి మరీ వచ్చారు.