: సన్మానం కోసం వచ్చిన సీఎం సిద్ధరామయ్య
హైదరాబాదు రవీంద్రభారతిలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్మానం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది. ఇందుకోసం నగరానికి విచ్చేసిన సిద్ధరామయ్యకు శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, మంత్రి రఘువీరారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈ సందర్భంగా సిద్ధరామయ్య సెలవిచ్చారు.