: వీడికి మరణ దండనే సరైంది!


ఐదేళ్ల పసిమొగ్గను పరమ కిరాతకంగా కాటేసిన మానవ మృగానికి థానే కోర్టు మరణ దండన విధించిది. మహారాష్ట్రలోని కోప్రిగావ్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల దత్తు ఈ ఏడాది జనవరి 22న తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి పిలిచి, అత్యంత హేయంగా అత్యాచారం చేసి చంపేశాడు. తరువాత శవాన్ని గోనె సంచీలో కట్టి చెత్త కుండీలో పడేశాడు. సాయంత్రం పనిలోంచి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు బిడ్డ కన్పించకపోవడంతో చుట్టుపక్కల వెదికి లాభంలేకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించారు.

దీంతో మర్నాడు తెల్లవారు ఝామున నిందితుడు చెత్త కుండీలో పారేసిన శవాన్ని వారి గుమ్మం ముందే పడుకోబెట్టి ఏమీ తెలీనట్టు వెళ్లిపోయాడు. అనంతరం పోలీసుల దర్యాప్తులో దత్తు నిందితుడని తేలింది. దీంతో అతడి భార్య, కుమారుడు అతడి కిరాతక మనస్తత్వాన్ని, ఇంతక్రితం అతను పాల్పడిన దాష్టీకాలను పోలీసులు, కోర్టు దృష్టికి తెచ్చారు.

ముర్దాబాద్ నుంచి వలస వచ్చిన ఇతడు అంతకుముందు ఒక ఉపాధ్యాయినిపై అత్యాచారానికి యత్నించాడు. ఇతని మనస్తత్వాన్ని, గత చరిత్రను, నేరాలను పరిగణలోకి తీసుకున్న థానే కోర్టు ఇతనికి మరణ దండన విధించింది. దీంతో థానే కోర్టు గత నెలరోజుల్లో అత్యాచారం కేసుల్లో విధించిన రెండో మరణశిక్ష ఇది. గతంలో కూడా శేఖర్ గుప్తా అనే కార్మికుడు ఎనిమిదేళ్ల చిన్నారిపై చేసిన అఘాయిత్యానికి ఈ నెల 16న న్యాయస్థానం మరణదండన విధించింది.

  • Loading...

More Telugu News