: కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. వీటికితోడు ఉపరితల అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలోని తొమ్మిది జిల్లాలలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు రుతుపవనాలు రాష్ట్రమంతటికీ ఇంకా విస్తరించలేదు. సోమవారం నాటికి విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.