: భూమి వంటి గ్రహాలను గుర్తించే కొత్త పరికరం


సుదూరంగా ఉన్న నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉండే, ధూళినిండిన భూమి వంటి గ్రహాలను గుర్తించడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూమి తరహాలోనే మనిషి నివాసయోగ్యంగా ఉండే గ్రహాలను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. నాసా నిధులతో నడుస్తున్న ఈ ప్రయోగాలను సాగిస్తున్న అంతర్జాతీయ బృందంలో అరిజోనా యూనివర్సిటీ ఖగోళ వేత్తలు కూడా పనిచేస్తున్నారు.

ఉపరితలం మీద నీటిని కలిగి ఉండడం వంటి నివాసయోగ్యతలను గుర్తించగలిగే కొత్త తరహా సాంకేతికతను తయారుచేస్తున్నారు. మన సౌరకుటుంబానికి సమీపంలో ఉండే నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే కొన్ని గ్రహాలు విస్తారంగా మేఘాలతో కూడి కనిపిస్తున్నాయి. మన సౌర వ్యవస్థలో కూడా అలాంటి ధూళి మేఘాలు ఉంటాయి. అందువల్ల భూమితో సారూప్యత ఉండే గ్రహాలను గుర్తించే ప్రయత్నాన్ని ఖగోళవేత్తలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News