: చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు?


కొంతకాలంగా నష్టాలతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ నెత్తిన, డీజిల్ ధర పెంపు రూపంలో మరోసారి పిడుగు పడ్డట్టయింది. డీజిల్ ధర లీటర్ కు 45 పైసలు పెంచడంతో ఆర్టీసీ కూడా చార్జీలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. తాజా పెంపుతో ఆర్టీసీపై రూ. 25 కోట్ల మేరకు భారం పడనుందని తెలుస్తోంది. బల్క్ డీజిల్ కొనే వినియోగదారులపై కేంద్రం సబ్సీడీ ఎత్తివేసిన నేపథ్యంలో రోడ్డు రవాణా సంస్థ  ఇప్పటికే రూ.775 కోట్ల మేర వార్షిక భారాన్ని మోస్తోంది.

మళ్లీ  చార్జీలు పెంచి నష్టాన్ని భర్తీ చేసుకుందామంటే, ప్రభుత్వం అనుమతిస్తుందో లేదోనని ఆర్టీసీ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి చార్జీలు పెంచడమంటే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడమేనని ప్ర్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.           

  • Loading...

More Telugu News